చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తల్లిదండ్రులు తేనె పట్టిస్తారు.
జలుబు నుంచి వాళ్ళకి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.


ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏడాది కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వడం ప్రమాదకరం.



పిల్లలకు తేనె ఇవ్వడం వల్ల వచ్చే ప్రమాదాన్ని బోటులిజం అని అంటారు.



ఎన్ హెచ్ ఎస్ ప్రకారం క్లోస్టిడియం బోటులినమ్ తేనె ఉత్పత్తుల్లో ఉంటుంది. ఇది ఎక్కువగా మట్టిలో కనిపించే బ్యాక్టీరియా.



ఆ విష పదార్థాలు శిశువు పేగుల్లోకి చేరి వారి నరాలు, మెదడు, వెన్నుపాముపై దాడి చేస్తాయి.



దాని వల్ల పక్షవాతం, మరణానికి కూడా కారణంఅవుతుందని వైద్యులు చెబుతున్నారు.



బోటులిజం అనేది అరుదైన, తీవ్రమైన వ్యాధి. ఇది 5-10 శాతం మంది పిల్లలని ప్రభావితం చేస్తుంది.



12 నెలల కంటే తక్కువ వయసు పిల్లలకు తేనె పట్టిస్తే ప్రాణాంతకం కావచ్చు.



బిడ్డకి ఏడాది వచ్చే వరకు తేనె పట్టించకూడదు. తర్వాత మెల్లగా అలవాటు చేయవచ్చు.
Images Credit: Pixabay/ Pexels