ప్రతి ఆహారాన్ని ఫ్రిజ్‌లోకి తోసేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి. వీటిని మాత్రం మినహాయించండి.

అరటి పండ్లు అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దానివల్ల సహజగుణం కోల్పోయి త్వరగా కుళ్లిపోతాయి.

వెల్లులిని కూడా అస్సలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఫ్రిజ్‌లో పెడితే వాటికి మొలకలు వస్తాయి.

ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల రుచి కోల్పోతాయి. వాటిని కూరలో వేసినా ఫలితం ఉండదు.

తేనెలో తక్కువ నీరు, ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి బయట ఉంచినా పర్వాలేదు. ఫ్రిజ్‌లో పెడితే గడ్డకట్టేస్తుంది.

బంగాళ దుంపలను ఫ్రిజ్‌లో పెడితే.. దాని పిండి పదార్థాలు చక్కెరలుగా మార్చేస్తాయి.

కాఫీ హైగ్రోస్కోపిక్.. అంటే పరిసరాల నుంచి తేమ, వాసనలను గ్రహిస్తుంది. ఫ్రిజ్‌లో పెడితే ఆ వాసనలు గ్రహిస్తుంది.

టమోటాలను కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దానివల్ల అవి రుచిని కోల్పోతాయి.

Image Credit: Pexels