క్యాన్సర్ ను తరిమి కొట్టే పవర్ ఫుల్ ఫుడ్స్ ఇవే!

ఈ రోజుల్లో క్యాన్సర్ రావడానికి ముఖ్యకారణం ఆహారం, కాలుష్యం.

కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

బెర్రీ పండ్లలోని విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాల క్యాన్సర్లను నిరోధిస్తాయి.

ద్రాక్ష పండ్లలోని రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణితులు పెరగకుండా అడ్డుకుంటుంది.

బ్రోకలీలోని సల్ఫోరాఫెన్ అనే యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా సాయపడతాయి.

టమాటలోని లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.

క్యారెట్లలోని బీటా కెరోటిన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

బీన్స్ దెబ్బతిన్న కణాలను సరి చేసి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

దాల్చిన చెక్క సైతం క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంటాయి.All photos Credit: pexels.com