గత కొద్ది రోజులుగా పెరుగుతోన్న గుడ్ల ధరలు చూసి గుడ్లు తేలేస్తున్నారు జనాలు.

అందుకే, ఈ టైమ్‌లో గుడ్లే తినాలా ఏంటీ? అవే పోషకాలు అందించే ఇవి కూడా ట్రై చెయ్యండి.

పన్నీర్: దీన్ని ఎగ్ బుర్జీ చేసుకుని తినొచ్చు. పన్నీర్‌ను నుజ్జుగా చేసి ఉల్లి, ఆయిల్, కారం, ఉప్పు వేసి వేయిస్తే చాలు.

గుమ్మడి గింజలు: 30 గ్రాముల గుమ్మడి గింజల్లో గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి.

సోయాబీన్స్: 28 గ్రాముల సోయాబీన్స్‌లో గుడ్డును మించి పోషకాలుంటాయి. వీటిని సలాడ్, స్నాక్స్‌గా తీసుకోవచ్చు.

చిక్కుళ్లు: వీటిలో కూడా ప్రోటీన్స్ పుష్కలం. జీవక్రియను పెంపొందించే మెగ్నీషియం కూడా ఉంటుంది.

చోలే: పెద్ద శనగల్లో చాలా ప్రోటీన్లు ఉంటాయి. 7.3 గ్రాముల శనగలు తింటే గుడ్డు తిన్నంత బలం వస్తుంది.

ఏం తిన్నా గుడ్డు రుచి గుడ్డుదే. ప్రోటీన్స్ మిస్ కాకూడదు అనుకొనేవారు ఇవన్నీ ట్రై చేయండి.. ధరలు తగ్గేవరకు.

Images Credit: Pexels and Pixabay