కోవిడ్ మూడేళ్లుగా తన ఉనికి తన ఉనికిని చాటుతూనే ఉంది. ఎదుర్కునే దారులు కూడా మనం వెతుకుతూనే ఉన్నాం. కొత్త వేరియెంట్ JN1ను ఎదుర్కునే శక్తి పెంచుకునేందుకు తగిన ఆహారం గురించి తెలుసుకుందాం. విటమిన్స్ సి ఇమ్యూనిటి పెంచుతుంది. కనుక విటమిన్ సి ఎక్కువ కలిగిన సిట్రస్ పండ్లు తప్పక తినాలి. రకరకాల ఖనిజలవణాలు, విటమిన్లు కలిగి ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం. ప్రొబయోటిక్స్ కలిగిన పెరుగు, యోగర్ట్ వంటి వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న అల్లంవెల్లుల్లిని రోజూ వంటల్లో వాడాలి. ప్రతి రోజూ ఒక గుప్పెడు బాదాములు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసెగింజల వంటివి తప్పక తీసుకోవాలి. పసుపులోని కర్క్యూమిన్ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పసుపు పాలు తాగితే మంచిది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. యాంటీబాడీల సంశ్లేషణకు, నిరోధక వ్యవస్థ బలపడేందుకు ప్రొటీన్ చాలా అవసరం. అందుకు చికెన్, టర్కీ వంటివి తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉన్నపుడు నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అనుమాన నివృత్తికి నిపుణులను సంప్రదించాలి Images courtesy: Pexels