అందమైన గోళ్లు అందరికీ ఇష్టమే. చేతులు నాజుగ్గా అందంగా కనిపించాలంటే గోళ్లు ముత్యాల్లా మెరుస్తూ ఉండాలి. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన సాల్మన్ ఫిష్ గోళ్ల ఆరోగ్యానికి మంచి. ఇన్ఫ్లమేషన్ తగ్గించి శరీరంలో తేమ నిలిపి ఉంచుతుంది. గుడ్లలో బయోటిన్ ఉంటుంది. ఇది బికాంప్లెక్స్ లో ఒకటి. ఇది గోళ్లు బలంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. పాలకూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ ఇ ఉంటాయి. వీటి వల్ల గోళ్లకు రక్తప్రసరణ మెరుగ్గా ఉండి గోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి. బాదాములలో ప్రొటీన్, జింక్, విటమిన్ ఇ ఎక్కువ. వీటితో గోళ్లు అందంగా, ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి. ప్రొటీన్, ప్రొబయోటిక్స్ కలిగి గ్రీక్ యోగర్ట్ గోళ్ల ఆరోగ్యానికి మంచిది. బీటాకెరోటిన్ చిలగడ దుంపల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ ఎ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే! Images courtesy : Pexels