బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు పవర్ సేవింగ్ మోడ్ ఆన్ చేసుకోండి. సెట్టింగ్స్‌లో అనవసరం లేని యాప్స్ డిజేబుల్ చేసుకోండి. స్క్రీన్ టైమ్ అవుట్‌ని వీలైనంత తక్కువ సమయానికి సెట్ చేసుకోవడం వల్ల బ్యాటరీ సేవ్ అవుతుంది. హోం స్క్రీన్ ఫుల్‌గా ఉంటే పవర్ ఎక్కువ డ్రెయిన్ అవుతుంది. డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో బ్రైట్‌నెస్‌ను వీలైనంత తక్కువ పెట్టుకుంటే బెటర్. వైబ్రేషన్ మోడ్‌ను ఆఫ్ చేయండి. నోటిఫికేషన్లు వీలైనంత తక్కువ పెట్టుకోండి. జీపీఎస్ అవసరం లేని సమయంలో దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఉపయోగించని యాప్స్‌ను క్లోజ్ చేస్తూ ఉండండి. డార్క్ థీమ్‌ను ఉపయోగించండి.