గులాబీ పువ్వులు అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి.

చాలామంది ఇంటి దగ్గర గులాబీ మొక్కలు పెంచుకుంటారు.

వాటికి పెంచడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి ఎండిపోతాయి.

కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మొక్క నిండుగా.. పువ్వులతో కళకళలాడుతూ ఉంటుంది.

ఆకులు ఎండిపోతున్నా, కొమ్మలు పసుపు రంగులోకి మారినా కట్ చేయాలి.

మొక్క గుబురుగా పెరగాలంటే కొమ్మలను 45 డిగ్రీల కోణంలో కట్ చేస్తూ ఉండాలి.

సహజమైన ఎరువులు వేస్తూ ఉంటే పురుగులు వంటివి పట్టకుండా ఉంటాయి.

నీరు బాగా అందేలా, సూర్యరశ్మి బాగా ఉండేలా చూసుకోవాలి. (Images Source : Unsplash)