రూ.21,499 విలువైన మోటొరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ 5జీని రూ.18,999కే కొనవచ్చు. మోటో జీ31 ధర రూ.12,999 నుంచి రూ.10,999కు తగ్గింది. పోకో సీ31పై రూ.500 తగ్గింపు అందించారు. ఈ ఫోన్ రూ.7,499కే అందుబాటులో ఉంది. పోకో ఎం4 ప్రో 5జీ ధర కూడా రూ.14,999 నుంచి రూ.12,999కి తగ్గింది. మోటో జీ40 ప్యూజన్ ధర ఏకంగా రూ.3,500 తగ్గింది. రూ.14,499కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. గేమింగ్ యాక్సెసరీలపై 80 శాతం వరకు తగ్గింపు అందించనున్నారు. టీవీలపై 70 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఐఫోన్లపై కూడా డీల్స్ అందించనున్నారు. కానీ వాటిని ఫ్లిప్‌కార్ట్ ఇంకా రివీల్ చేయలేదు. వైర్‌లెస్ ఇయర్ బడ్స్, టీవీ స్ట్రీమింగ్ డివైసెస్, ల్యాప్‌టాప్ యాక్సెసరీలపై కూడా తగ్గింపు లభించనుంది. ప్రతిరోజు రాత్రి 12 గంటలకు, ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు లిమిటెడ్ పీరియడ్ డీల్స్ ఉండనున్నాయి.