అవిసెగింజలను కచ్చితంగా తినాల్సిందే



అవిసెగింజలు తక్కువ ధరకే మార్కెట్లో దొరుకుతాయి. వీటితో ఆహారంలో భాగం చేసుకోవాలి.



ప్రతి రోజూ ఓ చెంచా అవిసె గింజల్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.



అవిసె గింజల్లో ప్రొటీన్లు, ఫైబర్, విటమిన్ బి1, విటమిన్ బి6, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.



అవిసె గింజలు తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్య రాకుండా ఉంటుంది.



ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని కచ్చితంగా తినాలి.



చర్మానికి, జుట్టుకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.



ఈ గింజల్లో విటమిన్ బి అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.



రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడతాయి.