హైదరాబాద్ నగరంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్ లోని అంకుర ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలో ఓచోట మంటలు చెలరేగి, క్రమంగా మిగతా అంతస్తులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రాణనష్టం తప్పిందని సిబ్బంది చెబుతున్నారు ఈ హాస్పిటల్ లో అధికంగా పేషెంట్లు చిన్నారుల, గర్బిణీలు ఉన్నారు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. నగరంలో శీతాకాలంలో వరుస అగ్నిప్రమాదాలు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది అగ్నిప్రమాదం జరగకముందు అంకుర హాస్పిటల్ ఇలా..