గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆదివారం బీజేపీ ఆఫీసులో అడుగుపెట్టారు గతేడాది రాజా సింగ్ పై బీజేపీ అధిష్ఠానం విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేశారు రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి భారీ ర్యాలీగా పార్టీ ఆఫీసుకు వెళ్లారు పార్టీ ఆఫీసుకు వచ్చి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని రాజా సింగ్ కలిశారు రాజా సింగ్ ను మళ్లీ గోషామహల్ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. రాముడు 14 ఏళ్ల వనవాసం ఉంటే, తాను 14 నెలలు వనవాసం చేశారన్నారు సస్పెన్షన్ ఎత్తేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు చెప్పారు తెలంగాణ ప్రజలందరికి రాజా సింగ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.