ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు ఈ పూజలో పాల్గొన్నారు. తర్వాత శమీపూజ కూడా చేయించారు. పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం వాహన పూజలో మనుమడు హిమాన్షును తోడ్కొని సీఎం పాల్గొన్నారు. పూజాకార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది కేసీఆర్ నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.