తరచూ ఆకలేస్తోందా? ఇలా చేయండి అధికంగా ఆకలి వేయడం కూడా సమస్యే. ఆకలి వేసినప్పుడల్లా తినడం వల్ల బరువు కూడా పెరిగిపోతారు. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తింటే త్వరగా ఆకలి వేయదు. ఏదైనా తినే ముందు గ్లాసు నీళ్లు తాగండి. దీని వల్ల ఎక్కువ తినే అవకాశం ఉండదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఎక్కువ కాలం పాటూ ఆకలి వేయదు. భోజనానికి ముందు వ్యాయామం చేస్తే తరచూ ఆకలి వేయడం తగ్గుతుంది. భోజనం తినడానికి అరగంట ముందు గ్రీన్ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. డార్క్ చాకొలెట్ తినడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అల్లం పొడి కొంచెం కొంచెం తినడం వల్ల కూడా తరచూ ఆకలి వేయదు.