ఎక్కువ మంది ఫేవరేట్ రెసిపీ ఇదే

ఇంతకుముందు రెసిపీ కోసం అమ్మనో, అమ్మమ్మనో అడిగేవారు. ఇప్పుడు గూగులమ్మను అడుగుతున్నారు.

గూగులమ్మను అడిగితే చాలు రెసిపీని, వంట వీడియోలను కూడా మీ ముందు పెట్టేస్తుంది.

ఈ ఏడాది ఎక్కువ మంది గూగుల్ లో వెతికిన రెసిపీ ఏంటో తెలుసా? పనీర్ పసంద.

గూగుల్ 2022 గ్లోబల్ డేటా ఈ విషయాన్ని తెలిపింది.

పసంద అంటే చిక్కగా ఉండే గ్రేవీ అని అర్థం. టొమాటోలు, ఉల్లిపాయలతో దీన్ని తయారు చేస్తారు.

పనీర్ ముక్కలతో నిండిన ఈ గ్రేవీని నాన్, చపాతీలతో తింటారు.

పనీర్ రెసిపీలలో ఇదొక స్పెషల్ వంటకం.

నచ్చితే మీరూ గూగులమ్మని అడిగి ఎలా చేయాలో తెలుసుకోండి.