కాఫీ చాలా రుచికరమైన పానీయం. కాఫీ ఇష్టం లేని వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు

కేవలం చురుకుగా ఉంచేందుకు రుచిని ఆస్వాదించేందుకు మాత్రమే కాదు, కాఫీతో బరువు కూడా తగ్గొచ్చట.

అదనంగా స్వీటెనర్ లు కలుపకుండా కాఫీ తాగితే మంచి మార్పును గమనించవచ్చు

బ్లాక్ కాఫీతో పోషకాలు కూడా అందుతాయి.

కాఫీలోని కెఫిన్ విశ్రాంతిగా ఉన్నపుడు కూడా కేలరీలను బర్న్ చేస్తుంది.

జీవక్రియలను వేగవంతం చేస్తుంది. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.

బ్లాక్ కాఫీ తాగితే ఆకలి తగ్గుతుంది. కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ను ఇస్తుంది.

కాఫీలోని కెఫిన్ వల్ల అడ్రినల్ స్థాయిలు పెరిగి శరీరం మరింత చురుకుగా ఉండి ఎక్కువ కేలరీలను బర్న్ చెయ్యవచ్చు.

కాఫీలోని థర్మోజెనిక్ ప్రభావం తో శరీరంలో వేడి పుడుతుంది. ఇది ఎక్కువ కేలరీల బర్నింగ్ కు కారణం అవుతుంది

కెఫిన్ రక్త ప్రవాహంలో ఫ్యాటీ ఆసిడ్స్ విడుదలకు కారణం అవుతుంది.

అది శక్తిగా మారుతుంది. వర్కవుట్ లో కేలరీల బర్నింగ్ కు దోహదం చేస్తుంది.
Representational image:Pexels