చింతచిగురుతో ఎక్స్‌ట్రా రుచి



మన తెలుగు రాష్ట్రాల్లో చింతచిగురును అనేక వంటకాలలో భాగం చేస్తారు. వెజ్ లేదా నాన్ వెజ్.. ఎందులో వేసినా రుచి అదిరిపోతుంది.



చింతచిగురు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఈ చింతచిగురు కనిపిస్తే కచ్చితంగా ఇంటికి తెచ్చి వండుకోండి.



చింతచిగురులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తరచూ తినడం వల్ల రక్తహీనత సమస్య రాదు.



కామెర్ల వ్యాధిని నయం చేసే శక్తి దీనికి ఉంది. చింతచిగురు రసాన్ని తీసి పటిక బెల్లాన్ని కలిపి తాగితే కామెర్ల వ్యాధి అదుపులో ఉంటుంది.



చింతచిగురును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వాతం సమస్యలు రావు.



ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు చింతచిగురును కచ్చితంగా తినండి.



నీటిలో చింతచిగురును వేసి బాగా మరిగించి వడకట్టి ఆ నీటిని తాగడం లేదా నోట్లో వేసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.



పిల్లలకు చింత చిగురు తినిపించడం వల్ల నులిపురుగుల సమస్య రాదు.