అతిగా నిద్రపోతే ఈ ఇబ్బందులు తప్పవు ఒక మనిషికి రోజుకు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. చాలా మంది రోజుకు పదికి పైగా గంటలు నిద్రకు కేటాయిస్తున్నారు. అతి నిద్ర చాలా ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నట్టు కొన్ని అధ్యయనాల్లో తేలింది. అతిగా నిద్రపోయేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. 9 నుంచి 11 గంటల పాటూ నిద్రపోయే మహిళల్లో కరోనరీ హార్ట్ డిసీజ్ లు రావచ్చు. రోజుకు తొమ్మిది గంటల కన్నా ఎక్కువ నిద్రపోయే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం 23 శాతం పెరుగుతుంది. అతి నిద్రకు ఊబకాయానికి మధ్య సంబంధం ఉన్నట్టు తేలింది. నిద్ర తగ్గితే డిప్రెషన్ బారిన పడతారు.