48 ఏళ్ల వయసులో ఇప్పటికీ తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరుస్తుంటుంది మలైకా.
సినిమాలతో కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
తనకంటే వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది.
వీరిద్దరూ తరచూ ట్రిప్ లకు, రెస్టారెంట్ లకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
రీసెంట్ గా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ అందులో నిజం లేదని క్లారిటీగా చెప్పింది ఈ జంట.
ఈ మధ్యనే మలైకాకు యాక్సిడెంట్ జరిగింది.
యాక్సిడెంట్ జరిగిన ఇన్నాళ్లకు ఫొటోషూట్ లో పాల్గొంది.
వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.