స్లీప్ వాకింగ్‌కు కారణాలివే

స్లీప్ వాకింగ్ అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తుందని కొన్ని అధ్యయనాలు తెలియజేశాయి.

కొన్ని కారణాల వల్ల కూడా నిద్రలో నడిచే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు.

జన్యుపరంగా కుటుంబచరిత్రలో ఉండడం వల్ల కూడా కొందరిలో నిద్రలో నడిచే అలవాటు వస్తుందని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి.

నిద్రలేమి వల్ల కూడా స్లీప్ వాకింగ్ సమస్య మొదలవుతుంది.

కొన్ని రకాల మందులు వాడడం వల్ల ఒక రకమైన నిద్రలోకి జారుకుంటారు, అప్పుడు నిద్రలో నడిచే అవకాశం ఉంది.

ఆల్కహాల్ తాగడం వల్ల ఒక వ్యక్తి నిద్ర దశల్లో అస్థిరత ఏర్పడుతుంది. ఇది స్లీప్ వాకింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది.

మెదడుకు గాయం తగలడం, మెదడు వాపు వంటివి నిద్రలో నడిచేందుకు ట్రిగ్గర్ చేసే అంశాలు.

పిల్లల్లో తీవ్ర జ్వరం కలిగినప్పుడు వారు స్లీప్ వాకింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు బయటపడింది.