సురేఖా వాణి.. సినిమాల్లో చేసినా చేయకపోయినా ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. సోషల్ మీడియాలో సురేఖ, ఆమె కుమార్తెకు మంచి ఫాలోవర్లు ఉన్నారు. విజయవాడకు చెందిన సురేఖ 1977లో జన్మించారు. 45 ఏళ్ల వయస్సులోనూ సురేఖలో ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదు. అందుకే ఆమెను అంతా ‘సంతూర్ మామ్’ అని అంటారు. తన కూతురికి తల్లిగా కాకుండా మంచి ఫ్రెండ్‌గా ఉంటూ యాక్టీవ్‌గా ఉంటారు. సినిమాల్లో అక్క, వదిన పాత్రల్లో ఒదిగిపోవడం సురేఖా స్పెషల్. తెలుగులోనే కూడా పరభాష చిత్రాల్లో కూడా ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. శారీలో మాత్రమే కాదు, మోడ్రన్ డ్రెస్సుల్లో కూడా సురేఖ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా షాంపైన్ బాటిల్, కేకుతో సందడి చేశారు. ఆమె ఫాలోవర్లు సురేఖకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. Images and Videos Credit: Surekhavani/Instagram