యాంకర్ సుమ మళ్లీ నటిగా తన లక్ పరీక్షించుకుంటున్నారు. ‘జయమ్మ పంచాయతీ’ చిత్రంతో మే 6న సుమ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు మాంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రీకాకుళం నేపథ్యంలో జరిగే ఈ కథలో సుమ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ప్రసుతం సుమ ఈ సినిమా ప్రమోషన్స్‌లో బీజీగా గడిపేస్తున్నారు. ఇటీవలే సుమా విజయవాడలో పర్యటించారు. ప్రస్తుతం కాకినాడలో ఉన్నారు. తాజాగా ఆమె తన భర్త రాజీవ్ కనకాల ఊరు యానంలో పర్యటించారు. యానంలో రాజీవ్ కనకాల తాతయ్య విగ్రహాం వద్ద సుమ ఆశ్వీరాదాలు తీసుకున్నారు. Images and Videos Credit: Suma Kanakala/Instagram