డ్రెస్సింగ్ సెన్సేషన్ ఊర్వశి రౌతెలా ఇండియాకు చెందిన సూపర్ మోడల్ ఊర్వశి రౌతెలా. అంతర్జాతీయ ఫ్యాషన్ షోలతో నిత్యం బిజీగా ఉంటుంది. షో స్టాపర్ గా అనేక సార్లు ర్యాంప్ వాక్ చేసింది. అందాల పోటీలకు జడ్జిలుగా కూడా వ్యవహరిస్తోంది. ఆమె డ్రెస్సులే ఆమెను మరింత ప్రత్యేకంగా చూపిస్తాయి. ఎమిగాలా అవార్డు తీసుకున్న సందర్భంలో ఆమె వేసుకున్న పొడవాటి గౌను ఇది. సీతాకోకచిలుక ఒంటిపై వాలితే ఇలాగే ఉంటుందేమో. అరబ్ ఫ్యాషన్ వీక్ లో ‘షో స్టాపర్’గా కనిపించిన మొదటి ఇండియన్ మోడల్ ఊర్వశి రౌతెలా.