స్టోనీ బ్రూక్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ క్వింగ్పింగ్ యావో ఓ షాకింగ్ విషయం చెప్పారు. ప్రోబయోటిక్ పిల్‌ను తీసుకుంటే ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. ఆ పిల్ తీసుకున్న వ్యక్తి వ్యాయామాలు చేసే సామర్థ్యాన్ని 10 % పెంచుకోగలిగాడు. అతడి బరువు కూడా ఏడు పౌండ్లకు తగ్గింది. ఈ మాత్రలను ‘నెల్లా’ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ మాత్రల్లో అథ్లెట్ల మలం నుంచి సేకరించిన బ్యాక్టీరియా ఉంటుందట. జోనాథన్ స్కీమాన్ అనే డాక్టర్ ఈ మాత్రలను సృష్టించారు. ఈ మాత్రలను తీసుకొనే వ్యక్తి పేగులను ప్రోబయోటిక్ స్వాధీనం చేసుకుంటుంది. అథ్లెట్ మైక్రోబయోమ్‌ను పోలీ ఉండేవరకు బ్యాక్టీరియాను నింపుతుంది. ఫలితంగా ఆ మాత్రలు తీసుకొనే వ్యక్తి అథ్లెట్లకు ఉండే శక్తిని పొందగలడు. రన్నర్లలో ‘బాక్టీరియం వీల్లోనెల్లా అటిపికా’ అనే సూక్ష్మజీవి అధికంగా ఉంటుంది. ఈ సూక్ష్మజీవి కండరాలను బలహీనం చేసే లాక్టిక్ ఆమ్లాన్ని తింటుంది. అందుకే, ఈ మాత్ర సత్ఫలితాలు ఇస్తోంది. Images and Videos Credit: Pixels