ఏప్రిల్ 29 రాశిఫలాలు
ఈ రాశులవారి దశ తిరుగుతుంది



మేషం
ఆర్థిక పరిస్థితి మార్పు ఉంటుంది. ప్రతికూల ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. సానుకూలంగా ఉండండి. ప్రేమ సంబంధాల్లో కొన్ని విభేదాలు ఉండొచ్చు. మీ సహోద్యోగుల్లో మీకు చెడుచేసేవారున్నారు అప్రమత్తంగా ఉండండి.



వృషభం
మీరు పనిచేస్తున్న రంగంలో కొత్త వ్యక్తులను కలుస్తారు. మీరు పిల్లల చదువుల పట్ల చాలా శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రేమ సంబంధాల గురించి మీరు భావోద్వేగానికి లోనవుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.



మిథునం
వంకర వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రణాళికలు వేస్తారు. పాత సమస్యలు పరిష్కరించుకుంటారు. మీరు పోటీతత్వాన్ని కలిగి ఉంటారు.



కర్కాటకం
ఈ రోజు మీరు ఒక పెద్ద బాధ్యతను నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంటారు. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. అసంపూర్తిగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. పరిస్థితులను తెలివిగా ఎదుర్కొంటారు. వ్యాపారంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి.



సింహం
విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసికంగా ఇబ్బంది పడతారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.ఈ రోజు సంతోషం, బాధ అన్నీ హెచ్చుతగ్గుల్లో ఉంటాయి. సోమరితనం వీడండి. సమయాన్ని వృథా చేయకండి.



కన్యా
వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిరోజు.స్నేహితులను కలవడంతో సంతోషంగా ఉంటారు. మీ ఖర్చులను కొంచెం తగ్గించుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో గౌరవం లభిస్తుంది.



తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది.డైలీ వర్క్స్ మారుతాయ్. ఇతరుల సలహాలు ఎక్కువగా తీసుకోకండి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకండి.ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం.



వృశ్చికం
ప్రేమికులు వివాహానికి ప్రణాళికలు వేసుకోవచ్చు.ఆఫీసులో మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి కారణంగా ఇంట్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు దూషించే పదాలు ఉపయోగించవద్దు. వ్యవహారాల్లో పారదర్శకంగా ఉండండి.



ధనుస్సు
ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్లో పడతారు. ఉద్యోగులకు అనుకూల సమయం. రక్తపోటు, షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. ఆవేశపూరిత చర్యల వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు.



మకరం
మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది.మీ ప్రతిభను చక్కగా ఉపయోగించుకుంటారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉన్నతాధికారులతో మీ సంబంధాలు బావుంటాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతారు.



కుంభం
అధిక పని అలసటకు కారణమవుతుంది. ఇంట్లో ఆనందం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావొచ్చు. వ్యాపారం ముందుకు సాగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.



మీనం
మీ ప్రవర్తన ఎవరికైనా బాధ కలిగించవచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఉన్నతాధికారులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.