సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ జైసల్మేర్‌లోని సూర్యఘర్ ప్యాలెస్‌లో వివాహం చేసుకోనున్నారు. జై సల్మేర్‌కు 16 కిలోమీటర్ల దూరంలో ఈ హోటల్ ఉంది. ఫిబ్రవరి 6వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. వీరిద్దరి కుటుంబాలు కూడా ఈపాటికే జైసల్మేర్‌కు చేరి ఉండాలి. మహేష్ బాబు, రామ్ చరణ్ వీరి వివాహానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వీరి వివాహానికి రానున్నారు. పెళ్లి తర్వాత ఢిల్లీ, ముంబైల్లో రిసెప్షన్లు జరగనున్నాయి.