తమన్నా డిసెంబర్ 21, 1989లో పుట్టింది. తన కెరీర్‌ను చిన్న వయసులోనే ప్రారంభించింది. 2005 సంవత్సరంలో హిందీలోనూ, తెలుగులోనూ హీరోయిన్గా కెరీర్‌గా మొదలు పెట్టింది.
ముందు సినిమాలు చేసినా.. హ్యాపీ డేస్ సినిమాతో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా కెరీర్లో సక్సెస్ అయింది తమన్నా ఒకరే.
గీతా సుబ్రహ్మణ్యంగా కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో అదిరే నటనను కనబరిచింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా బాగా హిట్ కావడంతో తమన్నాకు మంచి ఫేమ్ వచ్చింది.
100% లవ్ సినిమాలో పల్లెటూరి నుంచి పట్నం వచ్చి.. కాలేజ్ టాపర్‌గా మారి.. ఈగో ఉన్న మరదలి క్యారెక్టర్లో చేసి యువకుల మనసు కొల్లగొట్టింది తమన్నా. సినిమాలోనే కాకుండా దటీజ్ మహాలక్ష్మీ అంటూ అభిమానులు కూడా పొగిడేశారు.
తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసింది కానీ అవేమి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అనంతరం బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకుంది. బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క కంటే తమన్నాకే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది. పైగా యోధురాలిగా మంచి నటనను కనబరిచింది.
ఊపిరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది తమన్నా. కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. ఈ సినిమాకు తెలుగులో చాలా క్రేజ్ ఉంది. అలాగే తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి.
బాహుబలి 2 మంచి విజయం అందుకుంది. అనంతరం ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అదిరే హిట్‌ని అందుకుంది తమన్నా. ఈ సినిమాలో పండిన కామెడీ వారికి విజయాన్ని అందించింది.
పసిచిలకా అంటే సూర్య ఎంత గుర్తొస్తాడో తమన్నా కూడా అంతే గుర్తొస్తుంది. ఈ భామ తన లుక్స్‌తో, నటనతో సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తమన్నా అప్పటివరకు డీసెంట్ లుక్స్‌లో కనిపించినా.. లస్ట్ స్టోరీస్ 2 వెబ్‌సిరీస్ నుంచి ఆమె తనలోని మరో వెర్షన్‌ను బయటకు తెచ్చింది. ఈ సిరీస్ చేస్తున్న సమయంలోనే తన సోల్‌మేట్ విజయ్ వర్మని కలిసింది.
తమన్నా కెరీర్ ప్రారంభించి దాదాపు 20 ఏళ్లు. ఇప్పటికీ ఆమెకు అభిమానుల్లో మంచి పేరు ఉంది. తమ్మూ, మిల్కీ బ్యూటీ అంటూ అభిమానులు ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు.