ఎప్పుడూ మోడ్ర‌న్ లుక్ లో క‌నిపించే శోభిత ధూళిపాళ కాట‌న్ చీర‌లో చ‌క్క‌గా క‌నిపించారు.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె.. కాట‌న్ చీర క‌ట్టుకున్న ఫొటోల‌ను పోస్ట్ చేశారు.

అల్మ‌రా అద్దం ముందు నిలబడి నా తల్లిలా కనిపించడానికి ప్రయత్నిస్తున్నానని క్యాప్ష‌న్ రాశారు.

చక్క‌టి కాట‌న్ చీర‌, దానికి స‌రిప‌డ బ్లౌజ్ వేసుకుని, బొట్టు పెట్టుకుని అందంగా క‌నిపించారు ఆమె.

సింపుల్ మేక‌ప్, చెవిదిద్ద‌లు, బంగారు గాజుల‌తో వెలిగిపోయింది ఈ బ్యూటీ.

తెలుగింటి అమ్మాయిలా చక్క‌గా రెడీ అయ్యి.. ఎవ‌రికోస‌మో ఎదురుచూస్తున్న‌ట్లు క‌నిపించారు.

మోడ‌ల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన శోభిత ధూళిపాళ ఆ త‌ర్వాత సినిమాల్లోకి వ‌చ్చారు.

హిందీ, తెలుగు, త‌మిళ్, మలయాళంలో నటించారు ఆమె.

తెలుగులో గూఢ‌చారి, మేజ‌ర్ త‌దిత‌ర సినిమాల్లో నటించారు ఆమె.

Image Source: Sobhita / Instagram

మిస్ ఎర్త్ ఇండియా 2013 టైటిల్ గెలుచుకున్నారు, మిస్ ఎర్త్ 2013 ఫిలిప్పీన్స్ లో మ‌న దేశానికి ప్రాతినిధ్యం వహించారు.