బాయ్‌కాట్ ‘గేమ్ ఛేంజర్’

Published by: RAMA

కౌంట్ డౌన్

‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కు సిద్ధమవుతోంది

తెలుగు హీరో - తమిళ దర్శకుడు

రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తోన్న ఈ సినిమా తెలుగుతోపాటూ ఇతర భాషల్లోనూ ఒకేసారి విడుదలవుతోంది

ప్రమోషన్ జోరు

తెలుగు హీరో - తమిళ దర్శకుడు కాబట్టి తెలుగు, తమిళంలో ప్రత్యేకంగా ప్రమోషన్ అవసరం లేదు కానీ...ఇతర భాషల్లో ప్రమోషన్ తప్పనిసరి

డల్లాస్ లో ఈవెంట్

సినిమా రిలీజ్ కి టైమ్ దగ్గరపడడంతో ప్రమోషన్ జోరు పెంచారు.. కొన్ని రోజుల క్రితం అమెరికాలో ఈవెంట్ నిర్వహించారు

తెలంగాణలో

హైదరాబాద్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు..జనవరి 4న రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు..

కన్నడ సంగతేంటి?

అప్పటికే రిలీజ్ టైమ్ దగ్గరపడడంతో కర్ణాటకలో ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టే అవకాశం ఉండదు..అదే అక్కడ ప్రేక్షకుల ఆగ్రహానికి కారణం

నిరసనలు

కర్ణాటకలో ‘గేమ్ ఛేంజర్’ విడుదల వద్దంటూ పోస్టర్లపై బ్లాక్ పెయింట్ వేసి నిరసన తెలుపుతున్నారు

విడుదల ఆపేయండి

ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఏదీ కన్నడలో లేదని..ఇక్కడ తెలుగు మూవీ ఎందుకు రిలీజ్ చేయాలని క్వశ్చన్ చేస్తున్నారు

పెద్ద హెచ్చరికే ఇది

తమ హెచ్చరికలు పక్కనపెట్టి గేమ్ ఛేంజర్ కర్ణాటకలో రిలీజ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు