పుష్ప 2, KGF 2 ని తీసిపడేసిన రాకేష్ రోషన్.. కామెంట్స్ వైరల్!

Published by: RAMA

పుష్పరాజ్ పై రోషన్

2024 ఇయర్ ఎండ్ లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్టందుకుని రికార్డులు తిరగరాసిన పుష్ప 2 పై రాకేష్ రోషన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్

ఉత్తరాది స్టార్ల అక్కసు

ఓ డబ్బింగ్ సినిమా ఇలాంటి సంచలనాలు క్రియేట్ చేయడం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్..

బిగ్ బీ మినహా...

అమితాబ్ బచ్చన్ మినహా మిగిలిన ఉత్తరాది స్టార్లు ఎవ్వరూ సానుకూలంగా స్పందించలేదు. కంగనా కూడా సెటైర్స్ వేసింది

రొడ్డ కొట్టుడు

బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ లేటెస్ట్ గా ఈ మూవీపై రియాక్టయ్యాడు. ద‌క్షిణాది సినిమాలు చాలా గ్రౌన్డెడ్. మూలాల‌కు క‌ట్టుబ‌డిన సినిమాలు

పాత చింతకాయ పచ్చడి

సౌత్ మూవీస్ లో అవే పాత పంథా..రొడ్డకొట్టుడు..పాటలో యాక్షన్, డైలాగ్ లో భావోద్వేగాలు హైలెట్ అవుతుంటాయ్

అప్పుడు ఇప్పుడూ సేమ్ టు సేమ్

పుష్ప 2,KGF 2 లో పెద్దగా కొత్త దనం లేదు..అంతా పాతవైన పంథాలోనే సాగాయ్..ఈ తరహాలో గతంలో చాలా సినిమాలొచ్చాయ్

భిన్నాభిప్రాయాలు

రాకేష్ రోషన్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

టాలీవుడ్ వెలుగు చూడలేక

సౌత్ సక్సెస్ ను ముఖ్యంగా టాలీవుడ్ ఘనతను బాలీవుడ్ వర్గాలు అంగీకరించలేక ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని అంటున్నారు

ఎవరి అభిప్రాయం వారిది

మరికొందరు మాత్రం రాకేష్ రోషన్ కామెంట్స్ లో తప్పేముంది..అదే రొడ్డ కొట్టుడు నడుస్తోంది కదా..సినిమాలో కొత్తదనం ఏముంది అంటున్నారు