ఫ్యామిలీతో అమలాపాల్ సంక్రాంతి సెలెబ్రేషన్స్.. బుడ్డోడు భలే ముద్దుగా ఉన్నాడు!

హీరోయిన్ అమలాపాల్ తన ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంది.. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది

తన కొడుకు, భర్తతో కలసి దిగిన ఫొటోస్ అభిమానులతో పంచుకుంది.. ఈ ఫొటోస్ లో అమలాపాల్ తనయుడు హైలెట్ అవుతున్నాడు

బోసినవ్వుతో బుడ్డోడు భలే ముద్దొస్తున్నాడంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు

కొడుకుని చూసుకుని తెగ మురిసిపోతోంది అమలాపాల్.. పింక్ కలర్ శారీలో బ్యూటీ అదిరింది

మొదటి భర్తతో విడాకులు అయ్యాక అమలాపాల్ జగత్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది

పెళ్లైన తర్వాత తన జీవితంలో ప్రతి మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు ఆ పిక్స్ ఫ్యాన్స్ తో పంచుకుంటోంది

ప్రస్తుతం టైమ్ మొత్తం ఫ్యామిలీకే కేటాయించింది అమలాపాల్..పెళ్లైన ఏడాదిలోపే బిడ్డకు జన్మనిచ్చింది..

ఫ్యామిలీతో సంతోషంగా ఉండడమే కాదు..తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ కెరీర్లోనూ ముందుకెళుతోంది