నయనతార: ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది - థ్యాంక్స్ విఘ్నేశ్!
విఘ్నేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘నేను రౌడినే’ సినిమా విడుదలై 9 ఏళ్లైంది. ఈ సందర్భంగా ఆ మూవీని గుర్తుచేసుకున్న నయన్ తన భర్త విఘ్నేశ్ కి థ్యాంక్స్ చెప్పింది
అందమైన, సంతోషకరమైన జోడీల్లో నయన్-విఘ్నేశ్ టాప్ 5 లో ఉంటారని చెప్పుకోవచ్చేమో. వీళ్లను కలిపిన మూవీ నేను రౌడీనే.
ఈ సినిమా టైమ్ లోనే విఘ్నేశ్ తో కలసి పనిచేసింది నయనతార.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లివరకూ వచ్చింది.
ఇప్పుడు తానింత సంతోషంగా ఉన్నానంటే కారణం నేను రౌడనే మూవీ..నా జీవితాన్ని మార్చేసిన ఆ సినిమాకు, విఘ్నేశ్ కు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది
తొమ్మిదేళ్లక్రితం విడుదలైన నేను రౌడీనే నా కెరీర్ ను, జీవితాన్ని మార్చేసింది..ఎన్నో అనుభూతుల్ని అందించింది. ఈ విషయంలో ప్రేక్షకులకు రుణపడి ఉంటానని పోస్ట్ చేసింది
ఈ సినిమా గురించి గతంలో మాట్లాడిన విఘ్నేశ్.. హీరోయిన్ గా నయనతారను తీసుకోమని ధనుష్ చెప్పాడన్నాడు.
ఆమెకు కథ వినిపించి డేట్స్ తీసుకున్నాను..ఈ షూటింగ్ టైమ్ లో ఏడాదిపాటూ ఆమెతో ట్రావెల్ చేసే ఛాన్స్ వచ్చింది.. తన ఇష్టాయిష్టాలు తెలుసుకునే సమయం దొరికిందని చెప్పాడు
2015లో వచ్చిన నేను రౌడీనే మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ అయింది. తమిళం, తెలుగు ప్రేక్షకులను మెప్పించింది
దాదాపు ఏడేళ్లపాటూ డేటింగ్ చేసిన జంట 2021లో తమ ప్రేమను మీడియా ముందు వ్యక్తంచేశారు. 2022 జూన్ 9 న పెళ్లి జరిగింది. వీరికి ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు.