మహేష్ తో పీసీ..నిక్ తో నమ్రత!

నిక్‌ జొనాస్‌తో నమ్రత శిరోద్కర్‌ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

నమ్రతా శిరోద్కర్ తో పాటూ పిల్లలు గౌతమ్‌, సితార కూడా ఈ ఫొటోస్ లో ఉన్నారు

మహేశ్ బాబు ఫ్యామిలీ ఈ మధ్య ఇటలీ టూర్ వెళ్లొచ్చారు..ఆ విశేషాలు పోస్ట్ చేసింది నమ్రత

రోమ్ లో ‘ది లాస్ట్‌ ఫైవ్‌ ఇయర్స్‌’ షోను తనకోసం ప్రత్యేకంగా ప్రదర్శించినందుకు ప్రియాంకకు థ్యాంక్స్ చెప్పింది నమ్రత

ప్రియాంక భర్త నిక్‌ జొనాస్‌ పెర్ఫామ్‌ చేసిన షో అది..ఈ సందర్భంగా నిక్ తో పిక్స్ దిగి షేర్ చేసింది

నిక్ నటన అద్భుతంగా ఉందని..జామీ క్యారెక్టర్ తనను కదిలించిందని పోస్ట్ పెట్టింది నమ్రత

ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఈమూవీలో ప్రియాంక చోప్రా నటిస్తోంది

మొత్తానికి మహేష్ తో ప్రియాంక..నిక్ తో నమ్రత అంటూ సరదాగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు