సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మీనూ ..ఫ్యామిలీతో దుబాయ్ ట్రిప్!
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గాళ్ ఫ్రెండ్ గా నటించింది మీనాక్షి చౌదరి..
గతంలో చాలా సినిమాల్లో నటించింది కానీ ఈ రేంజ్ సక్సెస్ రావడం ఇదే ఫస్ట్ టైమ్
మహేష్ బాబుతో కలసి గుంటూరుకారంలో ఆఫర్ వచ్చింది కానీ సినిమా డివైడ్ టాక్ రావడంతో ఆఫర్ వర్కౌట్ కాలేదు
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో సీనియర్ హీరోతో ఆఫర్ ని రిజెక్ట్ చేయకుండా నటించడం ఆమెకు ప్లస్ అయింది
ఈ మూవీలో నటనం, అందం రెండింటిలోనూ మంచి మార్కులు వేయించుకుంది మీనాక్షి
భారీ కలెక్షన్లు వసూలు చేసి సంక్రాంతికి రిలీజైన అన్నింటిలో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది సంక్రాంతికి వస్తున్నాం
ప్రస్తుతం ఈ సక్సెస్ ని ఫ్యామిలీతో కలసి దుబాయ్ లో సెలబ్రేట్ చేసుకుంటోంది మీనాక్షి చౌదరి
2025లో ఫ్యామీలీతో కలసి వేసిన మొదటి ట్రిప్ ఇది.. చాలా ఆనందంగా ఉందంటూ పిక్స్ షేర్ చేసి పోస్ట్ పెట్టింది
హరియాణాకు చెందిన మీనాక్షి ఫెమినా మిస్ ఇండియా హరియాణా విజేతగా 2018లో కిరీటం అందుకుంది
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది
హిట్, ఖిలాడి, గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, ది గోట్, లక్కీ భాస్కర్, మట్కా, లక్కీ భాస్కర్ మూవీస్ లో నటించింది
ఇప్పటివరకూ తనపై ఉన్న ఐరెన్ లెగ్ ముద్రని...సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చెరిపేసుకుంది మీనాక్షి చౌదరి