టీచ్ ఫర్ చేంజ్ అనే NGO ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు మంచి విద్య అందేలా కృషి చేస్తోంది మంచు లక్ష్మి
తన బిడ్డకు అందుతున్న చదువే అందరి పిల్లలకు అందాలని భావించిన మంచు లక్ష్మి.. స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తోంది
లేటెస్ట్ గా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆలూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ స్మార్ట్ తరగతులను ప్రారంభించింది
మంచు లక్ష్మి ఇప్పటివరకు 51 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. ఇప్పటివరకూ 3833 విద్యార్థులకు నేరుగా స్మార్ట్ క్లాస్ విద్యను అందించే ఏర్పాట్లు చేశారు
ఈ రోజు పిల్లలకు మంచి చదువు అందిస్తే..రేపటి రోజు వాళ్లు మనకు అండగా ఉంటారు.. విద్యాదానం కన్నా గొప్పదానం లేదంటోంది మంచు లక్ష్మి
తన స్వచ్ఛంద సంస్థ అయిన టీచ్ ఫర్ చేంజ్ సహకారంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ స్మార్ట్ తరగతులు ఏర్పాటు చేసింది
మంచులక్ష్మి మంచి మనసు చూసి విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు కురిపిస్తున్నారు
మంచు లక్ష్మి ఆదిపర్వం మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో యక్షిణి గా నటించి మెప్పించింది
ఓ వైపు సినిమాలు, స్మాల్ స్క్రీన్ పై షోస్..మరోవైపు సేవాకార్యక్రమాలతో బిజీగా ఉంది మంచు లక్ష్మి