రంభ విడాకులు - ఇదిగో క్లారిటీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిన రంభ.. విడాకులు తీసుకోబోతోందనే వార్త వైరల్ అయింది. దానిపై స్పందించిన రంభ క్లారిటీ ఇచ్చేసింది
హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రంభ.. సౌత్ మూవీస్ తో పాటూ హిందీలోనూ నటించింది. స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది
రంభ ఇంటే సినిమాలో గ్లామర్ ట్రీటే అని యూత్ ఫిక్సైపోయేవారు.. అంతలా మెస్మరైజ్ చేసింది ఈ బ్యూటీ. అందుకే ఇండస్ట్రీలో ఉన్నది పదేళ్లే అయినా ఫాలోయింగ్ అలానే ఉండిపోయింది
2010లో తమిళ్ బిజినెస్ మేన్ ఇంద్ర కుమార్ పథ్మనాభన్‌ని పెళ్లి చేసుకుని కెనడాలో సెటిలైంది. ఆమెకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు.
14 ఏళ్లుగా హ్యాపీగా ఉన్న రంభ..తన భర్తతో విడిపోతోందంటూ రూమర్స్ వచ్చాయి..వాటిపై స్పందించిన రంభ క్లారిటీ ఇచ్చింది
ఎలా అంటే అలా రాసేస్తున్నారు వాస్తవాలు తెలుసుకోకుండా అని ఆవేదన వ్యక్తం చేసింది రంభ. తామిద్దరం చాలా హ్యపీగా ఉన్నామని క్లారిటీ ఇచ్చింది
కుటుంబంలో చిన్న చిన్న ఇష్యూస్ చాలా కామన్.. అవి విడిపోయేంత పెద్దగా ఉండవు..వాటిని భూతద్దంలో పెట్టి చూడొద్దంది
మన కల్చర్ పిల్లలకు తెలియాలనే పిల్లల్ని ఇండియాలో పెంచాలని నేను.. నార్త్ అమెరికాలో పెంచాలని తను అంటున్నారు..అదే ఇద్దరి మధ్యా ఇష్యూ అని చెప్పుకొచ్చింది