ఆర్ఆర్ఆర్ వచ్చి రెండేళ్లు గడిచినా ఆ సినిమా క్రేజ్ ఇంకా తగ్గలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా చాలా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా విడుదలై రెండేళ్లయినా ఇప్పటికీ వార్తల్లో ఉంటూనే వస్తుంది. ఇటీవలే ఇద్దరు జపనీస్ ఫ్యాన్స్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లొకేషన్లను సందర్శించారు. ఆర్ఆర్ఆర్‌లో పోజులతో ఫొటోలు దిగి ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దోస్తీ సాంగ్ షూట్ చేసిన లొకేషన్లో ఫొటోలు దిగి ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోలను ఆర్ఆర్ఆర్ అధికారిక పేజీలో కూడా పోస్టు చేశారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్‌లో సంవత్సరం తర్వాత కూడా ఆర్ఆర్ఆర్ హౌస్‌ఫుల్ అవ్వడం విశేషం. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ భారతీయ కరెన్సీలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం.