హాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఫ్యూరియోసా’ గత వారం థియేటర్లలోకి వచ్చింది. సినిమా మంచి పాజిటివ్ టాక్‌ను కూడా సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లు మాత్రం మరీ తీసికట్టుగా ఉన్నాయి. మొదటి వీకెండ్‌లో ఈ సినిమా 25 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసింది. మనదేశ కరెన్సీలో సుమారు రూ.211 కోట్లు అన్నమాట. ‘సలార్’ మొదటి వీకెండ్‌లో రూ.330 కోట్లు వసూలు చేసింది. అంటే దాదాపు 40 మిలియన్ డాలర్లు అన్నమాట. దీంతో రెబల్ స్టార్ రేంజ్ పెరిగిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ‘సలార్ 2’ ఎప్పుడు మొదలవుతుందనే విషయం తెలియరాలేదు.