సౌత్ ఇండియన్ హీరోయిన్లు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్నారు. గ్లామర్ మాత్రమే కాకుండా తమ నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కమల్ హాసన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ముంబైలో సైకాలజీ చదువుకున్నారు. చదువులో కూడా కొందరు టాప్ హీరోయిన్లు వెల్ క్వాలిఫైడ్‌గా ఉన్నారు. సాయి పల్లవి జార్జియాలో మెడికల్ డిగ్రీ చేశారు. కాజల్ అగర్వాల్ ముంబైలో మాస్ మీడియాలో గ్రాడ్యుయేషన్ చేశారు. కోలీవుడ్ క్వీన్ త్రిష చెన్నైలో బీబీఏ పూర్తి చేశారు. రష్మిక మందన్న సైకాలజీ అండ్ జర్నలిజం, ఇంగ్లిష్ లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. నయనతార ఇంగ్లిష్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. సమంత చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్ డిగ్రీ చదివారు.