పవన్ 'OG'లో DJ టిల్లు రాధిక

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకి సంబంధించిన అప్ డేట్ వైరల్ అవుతోంది

డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టితో ఈ మూవీలో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశాడట డైరెక్టర్ సుజీత్

పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ షూటింగ్ ఇంకా 20 శాతం బ్యాలెన్స్ ఉంది... థాయ్ లాండ్ లో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారట

నేహా శెట్టి కూడా త‌న ఇన్ స్టాలో థాయిలాండ్ లో ఉన్నా, ఓ షూటింగ్ కోసం వ‌చ్చా అనే హింట్ ఇచ్చింది కానీ OG సంగతి చెప్పలేదు

నేహాశెట్టి స్పెషల్ సాంగ్ సంగతి సరే..అందులో పవన్ కళ్యాణ్ ఉంటాడా లేదా అన్నది ఇప్పుడు మరో డిస్కషన్

ఇప్పటికే హరిహరవీరమల్లు కోసం అనసూయతో సెట్లో ఉన్నాడనే వార్తొచ్చింది..ఇప్పుడు థాయిలాండ్ వెళ్లే అవకాశం ఉందా అనేది డౌట్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురుచూపులన్నీ OG పైనే ఉన్నాయ్.. హరిహరవీరమల్లుపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు

2025 సమ్మర్లో రిలీజ్ కానున్న ఓజీలో పవన్ కి జోడీగా ప్రియాంకా అరుళ్ మోహన్ నటిస్తోంది...