బిగ్‌బాస్ ఫేమ్ అరియానా గ్లోరికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. రామ్‌గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఓవర్‌నైట్ స్టార్డమ్ దక్కించుకుంది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టింది. ఓటీటీ బిగ్‌బాస్‌కి కూడా వెళ్లి టాప్ 7 ప్లేస్ దక్కించుకుంది. ఈ మధ్యకాలంలో అరియానా గ్లామర్ ఫోటోషూట్లను చేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది. బిగ్‌బాస్ తర్వాత కాస్త బొద్దుగా మారిన ఈ భామ తాజాగా మళ్లీ స్లిమ్‌గా మారింది. తాజాగా అరియానా బ్యూటీకోసం పలు ట్రీట్మెంట్స్ చేయించుకుంది. బ్యూటీ కోసం స్కిన్, హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. స్కిన్ గ్లోయింగ్ సెషన్స్‌లో పాల్గొంటూ దానికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం అరియానా మాటీవీలో ఓ రియాలిటీ షోలో పాల్గొంది. అరియానా ఫోటోలు, వీడియోలు (Images Source : Instagram/Ariyana Glory)