ప్రియమణి నటించిన ‘భామాకలాపం’ 2022లో విడుదల అయి సూపర్ హిట్ అయింది. దీంతో ‘భామాకలాపం’కి సీక్వెల్‌గా ‘భామాకలాపం 2’ తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమ (ప్రియమణి) యూట్యూబ్‌లో 1 మిలియన్ సబ్‌స్క్రైబర్ మార్కును దాటతారు. తర్వాత పాత ఇంట్లో పని మనిషి శిల్ప (శరణ్య ప్రదీప్) పార్ట్‌నర్‌గా ‘అనుపమ ఘుమఘుమ’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తుంది. అనుకోకుండా వారు ఒక దొంగతనం చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే కథ. ‘భామా కలాపం’ మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా, రెండో భాగం హెయిస్ట్ థ్రిల్లర్. హెయిస్ట్ థ్రిల్లర్లకు దొంగతనాన్ని ఎలా చేశారు అనే విధానమే ప్రధాన ఆయువు పట్టు. కానీ ఆ హెయిస్ట్ ఎపిసోడ్ ప్రిడిక్టబుల్‌గా అనిపించడమే కాకుండా అంత ఎక్సైటింగ్ ఫీల్‌ను కూడా ఇవ్వదు. ఏబీపీ దేశం రేటింగ్: 2.5/5