కిర్రాక్ స్టైల్‌తో తెలుగువారికి బాగా దగ్గరైన యూట్యూబర్ అభిజ్ఞా. ఛాయ్ బిస్కెట్‌తో కలిసి ఈ భామ ఎన్నో బ్యూటీ వ్లాగ్స్, వీడియోలు చేసింది. తాజాగా డ్యాన్స్ నంబర్ చేసి ప్రైవేట్ ఆల్బమ్‌గా విడుదల చేసి మంచి వ్యూస్ కొట్టింది. ఈ భామ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ చరితార్థ్తో కలిసి జిమ్ వీడియో చేసింది. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఎక్కువగా జిమ్ చేస్తూ కనిపిస్తుంటుంది అభిజ్ఞా. వీరిద్దరూ చేసే వీడియో వర్క్ అవుట్స్ కపుల్ గోల్స్‌ని పెంచుతున్నాయి. చరితార్థ్ ఓ ఫిట్నెస్ ట్రైనర్, మోడల్. వీరిద్దరూ ఎన్నో ట్రిప్స్‌కి కలిసి వెళ్లారు. 2022 నుంచి వీరిద్దరూ రిలేషన్ ఉన్నట్లు చరితార్థ్ వర్మ ఇన్‌స్టాలో తెలిపాడు. ఇద్దరూ కెరీర్ పరంగా ముందుకెళ్లేందుకు కష్టపడుతున్నారు. ఈ భామ తన ఇన్‌స్టాలో బాయ్ ఫ్రెండ్ ఫోటోలు షేర్ చేయకపోయినా.. చరితార్థ్ ఇన్‌స్టాలో వీరి ఫోటోలు చాలా ఉంటాయి. అభిజ్ఞా బాయ్ ఫ్రెండ్ ఫోటోలు, వీడియోలు (Images Source : Instagaram/Charitardh Varma)