సీఈవో పదవిలోకి వెళ్లాక ఎలాన్ మస్క్ తన ఉద్యోగులకు మొదటి మెయిల్ పెట్టాడు.

విషయాలను షుగర్ కోట్ చేసి చెప్పడం తనకు రాదంటూ మస్క్ మెయిల్‌ను ప్రారంభించాడు.

కంపెనీ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాడు.

ట్విట్టర్ మార్కెట్లో నిలబడాలంటే పెయిడ్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్లు పెంచడం తప్పనిసరి అన్నాడు.

ట్విట్టర్‌కు వచ్చే ఆదాయంలో సగం దాని నుంచే రాబట్టాలని తెలిపాడు.

ప్రస్తుతం కంపెనీ గడ్డుకాలంలో ఉందన్నాడు.

దాన్ని దాటడానికి ఇంటెన్స్‌గా పని చేయాలని తెలిపాడు.

ఇక ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చేదే లేదన్నాడు.

వారంలో కనీసం 40 గంటలు ఆఫీస్ నుంచి పని చేయాలని ఆదేశించాడు.

ట్విట్టర్‌ను వేరే లెవల్‌కు తీసుకెళ్లడానికి మీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తున్నానంటూ మెయిల్‌ను ముగించాడు.
(All Images Credits: Elon Musk Twitter)