హైదరాబాద్ లో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికారులు వినూత్న టెక్నాలజీ తీసుకొచ్చారు ఓటర్లు చకచకా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి టైం వేస్ట్ కాకుండా ఓటు వేసి వెళ్లిపోవచ్చు https://ghmcbls.in/poll-queue-status లో హైదరాబాద్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల వివరాలు తెలుసుకోవచ్చు పోల్ క్యూ స్టేటస్ క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది పోల్ క్యూ రూట్ లో నియోజకవర్గాన్ని, ఆపై పోలింగ్ స్టేషన్ ఎంచుకోవాలి మీ పోలింగ్ కేంద్రంలో ఎంత మంది ఉన్నారు, ఓటు వేసేందుకు ఎంత టైం పడుతుందో ఉంటుంది హైదరాబాద్ లో ఓటర్లు ఈ టెక్నాలజీ ద్వారా తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్లి ఓటు వేయవచ్చు ఈసారి హైదరాబాద్ లో పోలింగ్ పెరుగుతుందని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ ధీమాగా ఉన్నారు