పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర గాడ్జెట్లను అనుమతించరని ఓటర్లు గుర్తుంచుకోవాలి ఓటర్ ఐడీ కార్డ్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, MNREGA జాబ్ కార్డ్ లాంటి ఏదైనా ఐడీ కార్డు వెంట తీసుకెళ్లాలి పోలింగ్ బూత్ లో మొదటగా పోలింగ్ అధికారి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసి, మీ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు రెండో పోలింగ్ అధికారి మీ వేలికి సిరా వేస్తారు. ఓటర్ స్లిప్ ఇచ్చి, రిజిస్టర్‌పై మీతో సంతకం చేయిస్తారు పోలింగ్ బూత్ లో మూడో పోలింగ్ అధికారికి ఓటర్ స్లిప్ ఇవ్వాలి. ఇంక్ వేసిన వేలిని చూపించి, తరువాత పోలింగ్ బూత్ లోపలికి వెళ్లాలి. ఈవీఎంలో మీకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్యాలెట్ బటన్ నొక్కితే ఓటు నమోదు అవుతుంది. బీప్ శబ్దం సైతం వినిపిస్తుంది. వీవీప్యాట్ మెషీన్ విండోలో అభ్యర్థి సీరియల్ నెంబర్, పేరు, గుర్తుతో కూడిన స్లిప్ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. ఈవీఎంలో మీకు ఏ అభ్యర్థి నచ్చకపోతే మీరు నోటా (NOTA)ను క్లిక్ చేయాలి. ఇది EVMలో చివరి బటన్ గా ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. అందరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ సూచించింది