కాలి మడమల చర్మం పగిలి చూసేందుకు ఇబ్బందిగా ఉండడం మాత్రమే కాదు నొప్పిగా కూడా ఉంటుంది.

కాళ్ల పగుళ్లకు కొన్ని కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలతో మంచి పరిష్కారం దొరుకుదుంది. అవేమిటో చూద్దాం.

ఒక టబ్ నిండా గోరువెచ్చని నీళ్లు పోసి దాంట్లో షాంపూ లేదా లిక్విడ్ సోప్ వేసి 15-20 నిమిషాలు నానబెట్టాలి.

అరికాలి చర్మం మీద ఉన్న మృతకణాలు తొలగించేందుకు ఒక ప్యూమిక్ స్టోన్ ఉపయోగించి మర్దనా చెయ్యాలి.

తర్వాత కాళ్ల కడిగి పొడిపొడిగా తుడిచి మందమైన మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలి.



రాత్రి పడుకునే ముందు కాళ్లు కడుక్కొని పొడిగా తుడిచి మాయిశ్చరైజర్ రాసి సాక్స్ వేసుకుని పడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

పెట్రోలియం జెల్లీ రాసి ప్లాస్టిక్ కవర్ చుట్టి కొన్ని కొన్ని గంటలు పాటు వదిలెయ్యాలి. ఇది కాళ్లచర్మంలో మాయిశ్చర్ పెంచేందుకు దోహదం చేస్తుంది.

మడమలకు గాలి తగలకుండా కప్పి ఉండే చెప్పులు ధరించడం మంచిది.

తగినన్ని నీళ్లు తాగితే శరీరం తేమతగ్గకుండా ఉంటుంది.



ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే!
Images courtesy : Pexels