​PNR అంటే ఏమిటి?

Published by: Jyotsna

PNR అంటే ప్యాసింజర్ నేమ్ రికార్డ్ (Passenger Name Record)

ఇది భారతీయ రైల్వే డేటాబేస్‌లోని ఒక రికార్డు నంబర్, ఇందులో ప్రయాణికుడి ప్రయాణానికి సంబంధించిన సమాచారం ఉంటుంది.

రైల్వే రిజర్వేషన్ సమయంలో ప్రతి ప్రయాణికుడికి ఈ 10 అంకెల యూనిక్ PNR నంబర్ జారీ చేయబడుతుంది.

IRCTC వెబ్‌సైట్‌లో PNR నంబర్‌ను నమోదు చేసి, టికెట్ కన్‌ఫర్మ్ అయిందో లేదో తెలుసుకోవచ్చు.​

10 అంకెలలో మొదటి మూడు అంకెలు రిజర్వేషన్ జోన్‌ను సూచిస్తాయి.

ప్రయాణ ప్రారంభ , ముగింపు స్టేషన్లు, క్లాస్, సీటింగ్ సమాచారం PNR నంబర్‌లో పొందుపరచబడుతుంది.

PNR నంబర్‌ను IRCTC వెబ్‌సైట్ , రైల్వే యాప్‌, స్టేషన్‌లోని ఎంక్వైరీ కౌంటర్‌లో చెక్ చేయచ్చు.