పనీర్ అధికంగా తింటే ఈ సమస్యలు



పాలతో తయారైన రుచికరమైన పదార్థం పనీర్. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి.



రుచిగా ఉంటుంది కదా అని రోజూ పనీర్ లాగిస్తే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు.



పనీర్‌లో అధికంగా లాక్టోజ్ ఉంటుంది. లాక్టోజ్ అధికంగా శరీరంలో చేరితే దాన్ని జీర్ణించుకోవడం కష్టం అవుతుంది.



పనీర్‌ను అధికంగా తింటే విరేచనాలు, వాంతులు, పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్, ఎసిడిటీ వంటి సమస్యల బారిన పడతారు.



మధ్యాహ్నం పూట పనీర్ కర్రీ తిన్నాక, రాత్రిపూట మళ్లీ పనీర్‌తో చేసిన వంటకాలు తినకండి.



పనీర్ అధికంగా తినడం వల్ల ఎక్కువగా వచ్చేవి జీర్ణ సమస్యలు. అలాగే బరువు కూడా త్వరగా పెరిగిపోతారు.



అధిక రక్తపోటు కూడా ఉన్నవారు కూడా పనీర్ మితంగా తింటేనే ఆరోగ్యకరం. దీన్ని అధికంగా తింటే రక్తపోటు పెరిగిపోవచ్చు.



పాలతో చేసిన పదార్థాలు అధికంగా తినడం వల్ల శరీరం రియాక్షన్ ఇస్తుంది. ఆ రియాక్షన్ చర్మంపై దురద, దద్దుర్లు వంటి రూపంలో కనిపిస్తుంది.