గొడ్డు కారం తింటేనే ఎక్కువ కాలం జీవిస్తారట



ఒక అధ్యయనం ప్రకారం కారం తినే వారే ఎక్కువ కాలం జీవిస్తారు. ఎవరైతే స్వీట్స్ అధికంగా తింటారో వారి జీవితకాలం తగ్గిపోతుంది.



గొడ్డుకారం తినేవారి జీవితకాలం పెరుగుతున్నట్టు అధ్యయనం చెబుతోంది.



సాధారణ ఆహారం తినేవారితో పోలిస్తే స్పైసీ ఫుడ్స్ తినేవారు 14% అధికంగా జీవించే అవకాశం ఉందని చెబుతోంది ఈ అధ్యయనం.



కారం తినేవారికి క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉంటాయని కూడా చెబుతోంది అధ్యయనం.



వారానికి రెండు రోజులపాటు స్పైసీ ఫుడ్స్ తింటే మరణ ప్రమాదం తక్కువగా ఉన్నట్టు పరిశోధనకర్తలు చెబుతున్నారు.



స్పైసీ ఫుడ్స్ లలో మిరపకాయలు, మసాలా దినుసులు ఇతర సుగంధ ద్రవ్యాలు వంటివి ఎక్కువగా కలుపుతారు.



వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉంటాయి.



కాబట్టే శరీరానికి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చి రోగాల బారిన పడకుండా అవి కాపాడుతున్నట్టు అధ్యయనం వివరిస్తోంది.